Thursday, April 16, 2020

రామ్ కర్రి గురించి... ౹ About Ram Karri
రామ్ కర్రి గురించి - About Ram Karri

తూర్పుగోదావరి జిల్లా , రాయవరం మండలం, రాయవరం గ్రామానికి చెందిన రామ్ కర్రి - నవ యువ కవి, రచయిత, బ్లాగర్, సాంకేతిక గురు, సామాజిక కార్యకర్త, పాత్రికేయులు, సామాజిక మాధ్యమాల్లో తెలుగు వినియోగాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన తెలుగు భాషా సైనికుడు.

ఈయన  2008 నుండే అంతర్జాలంలో అనేక వెబ్సైట్ల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన కృషీవలుడు

మరియు 

భారతీయ సంస్కృతి- సంప్రదాయాలను, నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలని తపించే మహర్షి.జననం - విద్య

ఈయన  కర్రి సుబ్రహ్మణ్యం, గంగాభవాని దంపతులకు, ఆయన అమ్మమ్మ ఊరు అయిన అదేయ్ జిల్లాకు చెందిన రంగంపేట మండలం, కోటపాడు గ్రామంలో జులై 16 1990 సంవత్సరం లో జన్మించారు...

ఈయన అమ్మమ్మ ఊరు అయిన కోటపాడు గ్రామంలో 5 వ తరగతి వరకు స్వగ్రామం అయిన రాయవరం లో 10 వరకు , అనపర్తి లో ఇంటర్మీడియట్ వరకు మరియు హైదరాబాద్ లో డిగ్రీ మరియు ఇతర సాంకేతిక పరమైన చదువుల్ని చదవడం జరిగినది...


తెలుగు భాషా సంరక్షణ వేదికతెలుగు భాష అభివృధి కోసం పాటుపడే సామాన్యులలో ఈయన కూడా ఒకరు...

                  “ తెలుగుభాషా సంరక్షణ వేదిక ” అనే ఒక సంస్థ ని ఏర్పాటు చేసి ఈ సంస్థ ద్వారా మన  తెలుగు భాష కి అలనాటి వైభవాన్ని తీసుకురావాలనే ఆకాంక్ష తో మన తల్లి భాషనీ మరచిపోతున్నా నేటి తరానికి ,ఆ...నుండి వ్యాకరణం, పద్యాలు, పాటలు, కవితలు, కథలను మరియు ఆనాటి కవుల గురించి వాళ్ళ రచనల గురించి మరొక మారు గుర్తు చేసి, మన తెలుగు యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా ముఖ పుస్తకలలోను, సామజిక వెబ్సైటుల ద్వారా మరియు వెబ్సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

అలాగేయ్ తెలుగు కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ...

  నేటితరం కవుల రచనలను మన ఈ తెలుగుభాషా సంరక్షణ వేదిక లో పొందుపరుస్తూ సమాజానికి పరిచయం చేస్తున్నారు.

అలాగే తెలుగు భాష కోసం కృషి చేసే వాళ్ళను ప్రోత్సహిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.

వాట్సప్ లలో సమూహాలను ఏర్పరచి అభివృధి వైపుగా అడుగులు వెయ్యడం జరుగుతుంది...

రేపటి తరం మన తెలుగు గొప్పదనం తెలుసుకోవాలనే ఉద్యేశం తో తెలుగు భాషా సంరక్షణ వేదిక అనే వెబ్సైట్ ని రూపొందించి అందులో పొందుపరచడం జరుగుతుంది...

అలాగే తెలుగు గ్రంథాలయం ని ఏర్పాటు చేసి తద్వారా ప్రతీ తెలుగు పుస్తకాన్ని పిడిఎఫ్ రూపంలో అందించి పుస్తక జ్ఞానాన్నీ చేకూర్చడం జరుగుతున్నది..

ఈ విధంగా ఆయన తెలుగు భాష అభివృధి కోసం  కృషి చేస్తున్నారు...రామ్ కర్రి పబ్లికేషన్స్

అదే విధంగా నవ కవుల రచనలను రామ్ కర్రి పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించడం జరుగుతున్నది..

రాంకర్రి జ్ఞాన కేంద్ర


మన పూర్వీకులు అందించిన అపూర్వ సంపద అయిన విజ్ఞానాన్ని, భారతీయ సిద్ధాంతాల్ని, భారతీయ సంస్కృతి - సంప్రదయాల్ని , నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని

మరియు
మన పూర్వీకుల నుండి మనం గ్రహించ లేకపోయిన మరెన్నో అద్భుతమయిన విషయాలను భావి తరాలకు అందించాలనే దృఢ సంకల్పం తో " రాంకర్రి జ్ఞాన కేంద్ర " అనే ఒక స్వచ్ఛంద సంస్థ ని స్వగ్రామం అయిన రాయవరం లో స్థాపించడం జరిగినది.

అటువంటి అద్భుతమైన విషయాలను ప్రపంచంలో ఉన్న ప్రతీ తెలుగు వారు పొందాలి అనే ఉధ్యేశం తో…

 ఆ సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ అయిన www.ramkarri.org   ద్వారా స్వచ్ఛందం గా అందించడం జరుగుతుంది…

అలాగే 276 వాట్సాప్ సమూహాలు మరియు టెలిగ్రామ్ గ్రూప్ ల ద్వారా కూడా ప్రజలకుఅద్భుతమైన విషయాలను అందిస్తున్నారు.

భారతీయ సంస్కృతీ - సంప్రదాయాలు, విజ్ఞానం , సనాతన ధర్మం , భారతీయ సిద్ధాంతాలు, నైతిక విలువలు అలాగే అనేక అద్భుతమైన విషయాలు అన్నీ ఒకే చోట లభిస్తున్నాయి కనుక ఈ వెబ్సైట్ ని " విలువల నిఘంటువు " అని కూడా అభివర్ణిస్తూ ఉంటారు వీక్షకులు.ప్రాణధాత ఫౌండేషన్


     
      " ప్రాణధాత ఫౌండేషన్ " అనే సేవా సంస్థ ని ఏర్పాటు చేసి, రక్త దాతలను సమాచారం అందివ్వడానికి వీలుగా జిల్లా ల వారిగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి, మరియు " ప్రాణధాత బ్లాగ్ " లో రక్త దాతల వివరాలను పొందుపరచడం జరిగినది.  

రక్తం అవసరమైన వాళ్ళు ఫోన్ చేయడానికి వీలుగా 8096339900 చరవాణి సంఖ్యను అందుబాటులో ఉంచి,

                 మన తెలుగు రాష్ట్రాలలోని వారికి ఎవరికైనా రక్తం అవసరం అయి పై నెంబర్ కి ఫోన్ చేసిన లేదా వాట్సాప్ లో సందేశం పంపిన వెంటనే ఆ సందేశాన్ని రక్త గ్రహిత యొక్క జిల్లాలో దగ్గరలో ఉన్నవారికి ఆ సమాచారం అందించి వాళ్ళచే రక్త దానం చేయించడం జరుగుతుంది.వైద్య నిలయం             ఆరోగ్యమే మహాభాగ్యము మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా, ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవి కి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము.

ఎవరికైనా ఏదయినా ఆరోగ్య సమస్య ఉంటే దాని గురించి సరియైన అవగాహన లేక చాలా బాధపడుతూ ఉంటారు.

                               వారి కోసం వైద్య నిలయం అనే వాట్సాప్ గ్రూపులను నడుపుతున్నారు అందులో నిపుణులు అయిన ఎందరో వైద్యుల్ని ని అడ్మిన్ గా నియమించి ఎవరికైనా ఏదయినా ఆరోగ్య సమస్య, సందేహాలు ఉంటే దానిని సమూహం లో పెడితే వాటికి అనుభవజ్ఞులైన వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తారు.

అలాగే ఎన్నో ఆరోగ్య సూచనలను వైద్యుల పర్యవేక్షణలో ఈ వైద్య నిలయం బ్లాగ్ ద్వారా అందిస్తున్నారు.సాంకేతిక విజ్ఞానం

                     ప్రతీ తెలుగు వారు సాంకేతిక విజ్ఞానాన్ని నేర్చుకోవాలనే తపనతో " సాంకేతిక విజ్ఞానం " అనే ఒక బ్లాగ్ ని తయారు చేసి తద్వారా సాంకేతిక పరమైన విషయాలను అచ్చమైన తెలుగు లో అందిస్తున్నారు.

అదే విధంగా విద్యార్థులకు సాంకేతిక పరమైన ఎన్నో సందేహాలకు అంతర్జాలం లోనే  సందేహ నివృత్తి చేస్తున్నారు...

     సాంకేతిక పరమైన విద్యలను తెలుగు తెలిసిన ప్రతీ ఒక్కరూ అభ్యసించాలి అనే ఆతృత తో అచ్ఛమైన తెలుగులోనే ఉచితం గా " సాంకేతిక విజ్ఞానం " ద్వారా అందిస్తున్నారు.            తెలుగు ఎడమ చేతి వాటం వాళ్ళ సంఘం                   ( Telugu Lefties Club - TLC )


ప్రపంచం లో ఉన్న తెలుగు ఎడమ చేతి వాటం వాళ్ళందరినీ ఒక తాటి పైకి తీసుకొని వచ్చి , ఆలోచనలను పంచుకొని సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేసారు.. తెలుగు ఎడమ చేతి వాళ్ళ సంఘాన్నీ తెలుగు లెఫ్టిస్ క్లబ్ ( టి.ఎల్.సి )

సంఘం లో ఎడమ చేతి వాటం గల ప్రతీ తెలుగు వారిని చేర్చుకుంటున్నారు తద్వారా సమాజానికి సేవ చేస్తున్నారు...సమగ్ర భారతీయ తెలుగు కాలమాన సూచిక (జంత్రి)


                    మనం సమగ్రమైన భారత తెలుగు కాలమానాన్ని (జంత్రి) మరచిపోయి, అర్థంలేని గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలండర్ ను అనుసరిస్తున్నాం అనే ఆవేదనతో...

      మన భారతీయ కాలమానం (జంత్రి) ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది.. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకృతికి విరుద్ధం అని భావించిన ఆయన...

         తెలుగు వారి కోసం మన భారతీయ కాలమాన సూచికని  ( జంత్రి )  అచ్చ తెలుగు లో ప్రతీ సంవత్సరం ముద్రించి ఉచితంగా అందచేస్తున్నారు ఆయన.

                    ఇందులో  తెలుగు మొదటి నెల అయిన చైత్రం తో మొదలయ్యి, చివరి నెల అయిన పాల్గుణం తో ముగుస్తుంది... 

ఆంగ్ల క్యాలెండర్ మాదిరి జనవరి నుండి డిసెంబర్ ఉండదు...

                       తిధుల ద్వారా గణింపబడిన ఈ భారతీయ తెలుగు కాలమాన సూచిక ను ( క్యాలెండర్ ) ని రూపొందిస్తున్నారు, ఇదే నిజమైన కాల సూచిక...

                      ప్రతీ సంవత్సరం ఈ భారతీయ కాల సూచిక (జంత్రి) ను చైత్రం మాసపు మొదటి రోజయిన చైత్ర శుద్ధ పాడ్యమి రోజున అనగా ఉగాది  పర్వదిననా విడుదల చేస్తున్నారు రామ్ కర్రి .
ఇలాంటి మరెన్నో సేవలను సమాజం కోసం స్వచ్ఛందంగా చేస్తున్నారు...
వెబ్సైట్

వాట్సాప్ 

          

యూట్యూబ్ 

వాట్సాప్ గ్రూప్స్ లింక్ 

టెలిగ్రామ్ గ్రూప్ 

లింక్డ్ ఇన్ 

ట్విట్టర్ 


ఫేస్బుక్ 


గూగుల్ మ్యాప్ చిరునామా 

రాంకర్రి జ్ఞాన కేంద్ర ,
1 - 240 , రాజ రాజేశ్వరీ కాలనీ ,
రాయవరం , రాయవరం మండలం ,
తూర్పుగోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ - 533346◆ ◆ ◆

Thursday, October 11, 2018

Computer Knowledge - About Computer Language

కంప్యూటర్ భాష గురించి :చాలా రోజుల తర్వాత మళ్లీ మీ ముందుకు ఒక పోస్ట్ తో వస్తున్నందుకు సంతోషంగా ఉంది.

ఇప్పటి వరకు కంప్యూటర్ తో మాట్లాడేందుకు ఒక భాష సమకూర్చుకున్నాం. ఇక కంప్యూటర్ కి ఆజ్ఞలు ఏ స్థాయి లో ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం.

   ఈ  ఈ సందర్భం లో నా చిన్నప్పటి ఒక వ్యాపార ప్రకటన గురించి ప్రస్తావించదలిచాను. "చిన్న మొత్తాల పొడుపు సంస్థ" కు సంబంధించిన ప్రకటన అందరికి గుర్తు ఉండే ఉంటుంది. "వేయి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలు పెడదాం..." అని. అదే విధంగా ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న, మరియు మానవ సహితం కాని అనేక చిక్కు ముడులను విప్పుతున్న కంప్యూటర్ కూడా ఆ యొక్క అత్యంత క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి శ్రీకారం ఒక చిన్న గణిత ప్రక్రియ తో మొదలు పెడుతుంది అదే "కూడిక"; అది కూడా ద్వి-సంఖ్యా మానం లో కూడిక.

  ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం అయినా నమ్మి తీరాల్సిన అక్షర సత్యం. మిగిలిన సంక్లిష్టమైన గణిత ప్రక్రియలన్నీ కూడా ఈ ఒక్క కూడిక ద్వారానే సాధించ వచ్చు అని ఒకటో తరగతిలో మన మాస్టారు చెప్పిన పాఠాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే చిక్కుముడి చాలా త్వరగా విడి పోతుంది.

   ఉదాహరణకు "తీసివేత" ను రెండవ సంఖ్య యొక్క గుర్తును + నుండి - కు మార్చి కూడటం ద్వారా సాధించ వచ్చు. అలాగే "గుణించుట" ను మళ్లీ మళ్లీ కూడటం ద్వారా సాధించవచ్చును. అలాగే "భాగహారం" ను మళ్లీ మళ్లీ తీసివేయటం ద్వారా సాధించవచ్చు. ఈ విధంగా కంప్యూటర్ అత్యంత క్లిష్టమైన గణిత సమస్యలను కూడా"కూడిక" అనే అత్యంత సాధారణ గణిత ప్రక్రియ ద్వారా సాధించ గల్గుతుంది.

  ఇక ద్వి-సంఖ్యా మానంలో కూడికల సంగతి ఇప్పుడు చూద్దాం. మనం సాధారణ దశాంశ మానం లో గమనించినట్లైతే మనకు ఉన్న పది అంకెలు 00-09 తర్వాత వచ్చే సంఖ్య పదుల స్థానంలో ఉన్న అంకె ఒకటి పెరిగి, ఒకట్ల స్థానంలో ఉన్న అంకె తిరిగి తన మొదటి విలువ 0 ను తీసుకుంటుంది. అనగా 10 అవుతుంది. అలాగే ద్విసంఖ్యా మానంలో కూడా 0, 1 తర్వాత వచ్చే సంఖ్య 10 అవుతుంది. అటు తదుపరి 11, 100, 101, 110, 111, ... వస్తాయి. 
  ఉదాహరణకు 25 ను ద్వి-సంఖ్యా మానం లో వ్రాసినట్లయితే 11001  అవుతుంది. దీనిని కొంత తేలికగా అర్ధం చేసుకోవాలంటే 25 గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి. 25 లో మొదటి అంకె 5 మరియు దాని స్థాన విలువ 1. అలాగే రెండవ అంకె 2 మరియు దాని స్థాన విలువ 10. అనగా 25 అనేది దానిలోని అంకెలను వాటి వాటి స్థాన విలువలతో గుణించి కూడగా వచ్చిన సంఖ్య. అనగా 5x1+2x10=25.

  ఇప్పుడు  దశాంశ మానంలో స్థాన విలువలు ఎలా మారుతున్నాయో చూద్దాం. ఇక్కడ మొదటి అంకె స్థాన విలువ 1. ఆ తరువాత అంకె స్థాన విలువ 10. (దశాంశ మానం కాబట్టి.) ఆ తరువాత అంకె స్థాన విలువ 100 (అనగా 10x10) తరువాతి అంకె స్థాన విలువ 1000 అనగా (10x10x10).

   ఇక ద్వి-సంఖ్యా మానం లో చూసినట్లయితే మొదటి అంకె స్థాన విలువ 1. తరువాతి అంకె స్థాన విలువ 2. (ద్వి-సంఖ్యా మానం కాబట్టి.) తరువాతి అంకె స్థాన విలువ 4. (2x2) తరువాతి అంకె స్థాన విలువ 8.(2x2x2). అటు తరువాతి అంకె స్థాన విలువ 16.(2x2x2x2). 

   పై విధంగా గమనించినట్లైతే 11001 యొక్క విలువ 1x1+0x2+0x4+1x8+1x16=25.

   ఇక ఒక దశాంశ మాన సంఖ్యను ద్వి-సంఖ్యా మానంలోకి తేలికగా మార్చటం ఎలాగ అనేది ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు 25 ని ద్వి-సంఖ్యా మానంలోకి మార్చుదాం. దీనికోసం ఆ సంఖ్యను సగం చేసి మిగిలిన శేషాన్ని దాని క్రింద వ్రాయండి. ఈ క్రింద చూపిన విధంగా.

     25  --> 12  -->  6 --> 3 -->  1  --> 0 
             1        0     0      1      1 
   ఈ సంఖ్యను కుడినుంచి ఎడమకు చదివినట్లైతే  మానం ద్వి-సంఖ్యా మానంలో 25 గా పైన చెప్పుకున్న సంఖ్య 11001 వస్తుంది. ఈ విధంహా మానం ఏ సంఖ్యనైనా ద్వి-సంఖ్యా మానంలోకి మార్చవచ్చును.

  మరొక ఉదాహరణగా 32 ను ద్వి-సంఖ్యా మానంలోకి మార్చి చూద్దాం. 
   32 --> 16 --> 8  --> 4 --> 2 --> 1  --> 0
          0      0      0     0     0      1 

   అనగా 32 ను ద్వి-సంఖ్యా మానంలో 100000 గా వ్రాయ వచ్చును. దీనిని స్థాన విలువలతో సరిచూద్దాం. దీని స్థాన విలువలను గణించినట్లైతే 0x1+0x2+0x4+0x8+0x16+1x32=32 అవుతుంది. 
ఇక కూడికలను ఈ క్రింద చూపిన విధంగా చేయవచ్చును.


http://i53.tinypic.com/2d7zj48.gifhttp://i53.tinypic.com/2lihpp2.gif 


 ఇక తీసివేత విషయానికి వస్తే, ఉదాహరణకు మనం 269-34(=235) ఎంతో కనుక్కోవాలనుకుందాం. మనం 69 లో నుండి 34 ను తీసివేసే బదులు, 69 కి 34 యొక్క పూర్ణ భాగస్వామిని (అనగా 34 కి ఏమి కలిపితే దగ్గరలోని పరిపూర్ణ సంఖ్య అనగా 1000 (ఇది సమస్య లోని అన్ని సంఖ్యల కన్నా పెద్దదైన పరిపూర్ణ సంఖ్య. గమనించగలరు.) వస్తుందో,ఇక్కడ అది 966 అవుతుంది.) కలిపినట్లయితే 269+966=269+(1000-34)=1235 అవుతుంది. సరిగ్గా గమనించినట్లైతే మనం రెండవ సంఖ్య ను తీసివేయ్యటానికి బదులుగా దాని పూర్ణ భాగస్వామిని మొదటి సంఖ్యకు కలుపుతున్నాము. అనగా మొత్తం లెక్కలో ఒక పరిపూర్ణ సంఖ్య 1000 ని అదనంగా కలుపుతున్నాము. కాబట్టి మనకు సరైన సమాధానం కావాలంటే తుది సమాధానం నుండి ఆ పరిపూర్ణ సంఖ్యను తీసివేసినట్లితే సరిపోతుంది. ఇంకా తేలికగా చెప్పాలి అంటే తుది సమాధానంలో ఎడమ చివరి అంకెను విస్మరించినట్లైతే మిగిలినదే మనకు కావలిసిన సమాధానం అవుతుంది. 

 ఆ విధంగా ఫకీర్ బాబా తాయెత్తు లాగ, సర్వ రోగ నివారిణి లాగ ఒక్క గణిత ప్రక్రియతోనే ప్రాధమిక గణిత సమస్యలనన్నిటిని పూరించ గల్గుతున్నాం. కాకపొతే ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఆ రెండవ సంఖ్య యొక్క పూర్ణ భాగస్వామిని కనుక్కోవటం ఎలాగ? దానికోసం మరొక తీసివేత చెయ్యాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 

 ఆ విధంగా కంప్యూటర్ కి చెప్పటానికి తేలికగా ఉంటుంది అని ఒక్క గణిత ప్రక్రియనే ఎంచుకొని మన పూర్వ గణిత పరిజ్ఞానాన్ని అంతా త్రవ్వి తీసి మన గణిత పద్ధతులనే మార్చుకుంటే మళ్లీ సమస్య మొదటికి వచ్చిందే అనే సందేహం కలగవచ్చు. 

 కాని ఇప్పటివరకు మనం చూసింది దశాంశ మానం లో తీసివేత గురించి. అదే ద్వి-సంఖ్యా మానంలో తీసివేతలో ఏమైనా సౌలభ్యం ఉందేమో చూద్దాం. ద్వి-సంఖ్యా మానంలో 0 నుండి 1 ని తీసివేయవలసిన సందర్భంలో  0 యొక్క ఉన్నత స్థానం నుండి 1 అప్పుగా తీసుకుంటాము. అది ప్రస్తుత స్థానంలో 2 గా మారుతుంది. ఉదాహరణకు ఈ క్రింది తీసివేతను గమనించండి.
 http://i54.tinypic.com/oj09kn.gif

మరొక ఉదాహరణగా 25-9 ని ద్వి-సంఖ్యా మానంలో చేసి చూద్దాం. అనగా మనం 11001-01001 విలువను మనం ఇప్పుడు కనుక్కోవాలి. మనం సాధారణ పద్దతిని ఉపయోగించినట్లైతే సమాధానం 10000 గా గుర్తించవచ్చు. అయితే మన పధ్ధతి ద్వారా అయితే 01001 కి మనం పూర్ణ భాగస్వామిని కనుక్కోవాలి. అనగా దగ్గరలోని పరిపూర్ణ సంఖ్య 100000 నుండి దానిని తీసివేస్తే వచ్చిన సంఖ్య మనకు కావాలి. గణించి చూసినట్లయితే దాని విలువ 10111 గా గుర్తించవచ్చును. సరిగ్గా గమనించినట్లైతే అది మన సంఖ్య 01001 లో సున్నాలు, ఒకట్లను తారుమారు చేస్తే వచ్చిన సంఖ్య 10110 కి 1 కలిపితే వచ్చే సంఖ్య కు సమానం అవుతుంది.

 మీకు ఇంకా అనుమానంగా ఉంటే 01010 కి సంబంధించిన పూర్ణ భాగస్వామిని కనుక్కోండి. దాని విలువ 10101 కి 1 కలుపగా వచ్చే సంఖ్య 10110 అవుతుంది. 

 ఇంతకు ముందు పోస్ట్ లో చెప్పుకున్నట్లుగా 1 ని వెలిగే బల్బ్ గాను 0 ను ఆరిపోయిన బల్బ్ గాను గుర్తించినట్లితే అన్ని ఆరి పోయిన దీపాలను వెలిగించి అన్ని వెలుగుతున్న దీపాలను ఆర్పమని చెప్పటం, అనగా 0 మరియు 1 లను తారుమారు చెయ్యమని కంప్యూటర్ కి చెప్పటం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. అటు తర్వాత జరిగే పని 1 ని కూడటం. అది కంప్యూటర్ కి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మనం దాని గురించి ఆలోచించ వలసిన అవసరం లేదు. ఆ విధంగా కంప్యూటర్ చేత తీసివేత కూడా చేయించ వచ్చును. 

 తరువాతి గణిత ప్రక్రియ "గుణించుట". ఉదాహరణకు 2x5=10 ని మనం 2+2+2+2+2=10 గా గణించ వచ్చును.

   ఇక మిగిలిన గణిత ప్రక్రియ "భాగహారం". ఉదాహరణకు 5/2=2.5 అనే విలువను గణించటానికి మనం "తీసివేత" ను ఉపయోగించవచ్చు అని చెప్పుకున్నాము. 5-2-2=1 ఇక్కడ రెండును ఎన్ని సార్లు తీసివేస్తున్నాము అనేది లెక్కించగల్గితే సమాధానంలో చుక్కకు ముందు అంకె అనగా 2 వస్తుంది. ఇక శేషం 1 ని 10 తో (ద్వి-సంఖ్యా మానం లో ఐనట్లైతే 2 తో) గుణించినట్లైతే 10 వస్తుంది. ఇప్పుడు మరలా తీసివేత కార్యక్రమాన్ని కొనసాగించినట్లైతే 10-2-2-2-2-2=0. ఈ సారి రెండును 5 సార్లు తీసివేయవలసి వచ్చింది. అనగా మన సమాధానం లో చుక్క తరువాత మొదటి అంకె వచ్చింది. ఇక శేషం ఏమి మిగలలేదు కాబట్టి మన భాగహార ప్రక్రియ ఇంతటితో ఆపివేయ వచ్చును. ఒక వేళ ఇంకా శేషం ఉన్నట్లయితే మరలా పదితో గుణించి తీసివేత కార్యక్రమాన్ని కొనసాగించ వలసి ఉంటుంది. దీనితో భాగహారాన్ని కూడా కూడికల రూపం లోకి మార్చగలిగాము.

ఆ విధంగా కంప్యూటర్ కి ఆజ్ఞలు ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక కంప్యూటర్ లోపల మన ఆజ్ఞలను గుర్తించటానికి పాటించటానికి ఎటువంటు ఏర్పాట్లు ఉన్నాయి అనే విషయం తదుపరి పోస్ట్ లో చూద్దాము.

 దీనిని బట్టి చూస్తే కంప్యూటర్ కి మనకి తెలిసినంత కూడా తెలియదని అర్ధం అవుతోంది. కాబట్టి దానిని ఒక మానవాతీత మహా శక్తి అని ఊహించాల్సిన అవసరం లేదనుకుంటాను. కాకపోతే వంద ఉపాయాలు తెలిసిన నక్క కన్నా ఒక్క ఉపాయం తెలిసిన పిల్లి బ్రతికి బట్ట కట్టినట్లు ఒకే ఒక గణిత విధానం తెలిసిన కంప్యూటర్ దానినే అనేక సార్లు విసుగు విరామం లేకుండా ఉపయోగించటం వలన మనుషులను మించిన పనులను చేయగల్గుతుంది. 

http://i53.tinypic.com/2lusaqt.jpg 

 ఏవిధంగానైతే వినాయకుడు తనకు తెలిసిన తల్లిదండ్రులను పూజించటం అనే ఒకే విద్యను భక్తి తో ఆచరించి గణాధిపత్యం పొందాడో, అలాగే కుమార స్వామి అన్ని తెలుసుననుకొని అభాసుపాలయ్యాడో అలాగే కంప్యూటర్ ముందు మనిషి తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది.

 తదుపరి పోస్ట్ లో మరిన్ని విషయాలతో మీ ముందుంటాను... అంత వరకు శెలవు తీసుకుంటూ...

Computer Knowledge - ప్రాథమిక పరిజ్ఞానం - 2

ప్రాథమిక పరిజ్ఞానం - 2


కంప్యూటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు సమాచార నిల్వ మరియు సమాచార విశ్లేషణ గురించి ప్రాధమిక సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము...

పూర్వం ఆదిమానవుడు సంచార జీవితం గడిపేటప్పుడు ఎక్కడ నీరు ఆహారం పుష్కలంగా ఉంటుందో అక్కడకు వెతుక్కుంటూ వెళ్ళేవాడు. దాని కోసం ముందుగా ఒక వ్యక్తి ఈ ప్రాధమిక అవసరాలను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. అవి ఎక్కడ లభిస్తే అక్కడ ఎండు కొమ్మలు, పచ్చి ఆకులు తగులబెట్టి పొగ రాజేసేవాడు. దానిని బట్టి మిగిలిన తెగ మొత్తం అక్కడకు చేరుకునేది. మొదటి సారిగా ఈ విధంగా నిప్పును సందేశాలను చేరవేయటానికి ఉపయోగించారు.
http://i55.tinypic.com/16bk39c.gifASCII Code


ఆ తరువాత దానినే యుద్ధ సమాచారాలను చేరవేయటానికి ఉపయోగించారు.
http://i55.tinypic.com/18ltmt.jpg http://i51.tinypic.com/25ppl5g.jpg
 ఇప్పటికీ మనం ఈ విధానాన్ని సముద్ర ప్రయాణంలో ఉపయోగిస్తున్నాము.
http://i51.tinypic.com/29d7rk2.jpg
 ఈ విధంగా చీకటి వెలుగులను సృష్టించటం ద్వారా సమాచారాన్ని ఒక చోటినుంచి మరొక చోటికి చేరవేసేవారు.


ప్రస్తుత కాలంలో ఈ చీకటి వెలుగులను సృష్టించటానికి మనం విద్యుత్ శక్తిని ఉపయోగిస్తున్నాము. స్విచ్ ని ON మరియు OFF చెయ్యటం ద్వారా లైట్ ని వెలిగించి ఆర్ప గలుగుతున్నాము. ఎదుటి మనిషి ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియని సమయంలో కూడా ఈ పద్దతి సమాచారాన్ని చేరవేయటానికి ఉపయోగపడింది. 

 అలాగే మనం ఎలా ఉంటుందో తెలియని కంప్యూటర్ తో మాట్లాడాలంటే ఇలాంటి ON మరియు OFF మాత్రమే ఉన్న అత్యంత తేలిక పాటి భాష ఒకటి కావాలి. అదే Binary Code. లాటిన్ భాష లో Bi అంటే 'రెండు' అని అర్ధం. ఈ భాష లో రెండే పదాలు ఉన్నాయి కనుక ఆ పేరు వచ్చింది. కంప్యూటర్ ఎలాగు కరెంట్ తోనే పని చేస్తుంది కాబట్టి switch ON మరియు switch OFF లను గుర్తించ గల్గుతుంది.(దీనికి ప్రత్యేక ఏర్పాట్లు కావాలి. అవేమిటో తదుపరి post లో చూద్దాం.)


కంప్యూటర్ పరిభాషలో ON ను 1 గాను మరియు OFF ను 0 గాను సూచిస్తారు. మనం సాధారణంగా ఉపయోగించే దశాంశ మానం (0-9)లాగానే దీనిని ద్విసంఖ్యా మానం అంటారు. మొత్తం భాషలో 0 మరియు 1 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు 
రెండంకెలతో మనం నాలుగు వేర్వేరు సంఖ్యలను సృష్టించవచ్చు.
  00 01 10 11     2 x 2 = 4  
మూడంకెలతో మనం ఎనిమిది వేర్వేరు సంఖ్యలను మనం సృష్టించవచ్చును. ఈ క్రింది విధంగా...

       000 001 010 011  

       100 101 110 111        2 x 2 x 2 = 8 
అదే విధంగా 4 అంకెలతో 2x2x2x2 = 16 వేర్వేరు సంఖ్యలను సృష్టించవచ్చును. 
ఆ తరువాత అమెరికా వారు మనం ఎక్కువగా ఉపయోగించే 128 అక్షరాలు, అంకెలు మరియు గుర్తులతో పాటు మనం అంతగా ఉపయోగించని మరొక 128 గుర్తులను కలిపి ASCII అనే ప్రామాణిక భాషను తయారు చేసారు. దానిని మనం ఇప్పుడు చూద్దాం.
ఈ మొదటి 31 కంప్యూటర్ ని నియంత్రించటానికి ఉపయోగిస్తారు.
http://i53.tinypic.com/154bu6u.png 
 ఈ తరువాత 97 సాధారణంగా ఉపయోగించేవి.
http://i54.tinypic.com/2d0lw07.png     http://i54.tinypic.com/2urat8g.png 

మరికొన్ని అంతగా ఉపయోగించని ప్రత్యేక చిహ్నాలు.
http://i55.tinypic.com/15hii6f.png    http://i55.tinypic.com/wtai35.pngఆ విధంగా మనం ఉపయోగించే 256 వేర్వేరు గుర్తులను 256 ద్విసంఖ్యా మాన సంఖ్యలతో సూచించారు. అనగా ద్విసంఖ్యామానం లో  (2x2x2x2x2x2x2x2 = 256) ఎనిమిది అంకెల సంఖ్య అవుతుంది. కంప్యూటర్ పరిభాషలో ఒక్కొక్క ద్విసంఖ్యామాన అంకెను "Bit" (బిట్) అంటారు. అలాగే మొదటి 256 ద్విసంఖ్యామాన సంఖ్యలలో ఒక్కొక్క ఎనిమిది అంకెల సంఖ్య మనం ఉపయోగించే ఒక్కొక్క అక్షరాన్ని సూచిస్తుంది కాబట్టి దానికి కూడా ఒక పేరు పెట్టారు. అదే "Byte" (బైట్). 


ఆ విధంగా మనం చెప్పదలుచుకున్న ప్రతి విషయాన్ని keyboard మీద టైపు చేసి కంప్యూటర్ కి చెప్పవచ్చును. అది binary భాషలో కంప్యూటర్ కి చేరుతుంది. 


ఇప్పటివరకు మనం కంప్యూటర్ కి అర్ధం అయ్యే భాషను తయారు చేసుకున్నాము. ఇక వచ్చే ముఖ్యమైన సమస్య దానికి ఏ స్థాయి లో ఆజ్ఞలను ఇవ్వాలనేది. దాని గురించి తరువాతి post లో చూద్దాం...

Computer Knowledge - About Processor

ప్రాసెసర్ గురించి :

ఇప్పటి వరకు ఉన్న ప్రాధమిక పరిజ్ఞానంతో CPU లోపల ఉన్న Processor గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా CPU యొక్క నమూనా పటాన్ని ఇప్పుడు చూద్దాం.
http://i53.tinypic.com/4qg1p0.jpg 
 ఇక్కడ అన్నిటికన్నా పైన ఉన్నది Processor. ఇది కంప్యూటర్ కి చిన్న మెదడు లాంటిది అని చెప్పుకున్నాము. కానీ పటంలో CPU అని గుర్తించబడి ఉన్నది ఏమి అని అడగవచ్చును. మీరు CPU లోపల ఏముంది? -3 పోస్ట్ లో చర్చనీయాంశాలను చూసినట్లయితే CPU గురించి ఒక విషయం గమనించి ఉంటారు. అది ఏమంటే "సందర్భాన్ని బట్టి CPU ని Processor , Memory, మరియు ఇతర భాగాలతో కూడిన డబ్బాగా అనుకోవచ్చును. లేదంటే ఒక్క Processor నే CPU గా అభివర్ణించవచ్చును." అని. మనం CPU లోపల ఉన్న చిన్న చిన్న భాగాలను గురించి వివరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి; ఈ సందర్భంలో CPU అనేది Processor అవుతుంది. (తదుపరి చర్చ మొత్తంలోనూ Processor అన్న పదమే ఉపయోగింపబడింది. పాఠకుల అవగాహన కొరకు మాత్రమే పై వివరణ ఇవ్వబడింది.)


పై పటంలో Processor తరువాత ముఖ్యంగా కనబడుతున్నవి చదరంగా ఉన్న మరొక రెండు భాగాలు. అందులో పైన ఉన్నది North bridge అనగా ఉత్తర వారధి. క్రింద ఉన్నది South bridge అనగా దక్షిణ వారధి. పై పటాన్ని ప్రపంచ పటంగా అనుకుంటే ఉత్తర దిక్కున ఉన్న దానిని ఉత్తర వారధి అన్నారు. దక్షిణ దిక్కున ఉన్న దానిని దక్షిణ వారధి అన్నారు. అవి ఇతర భాగాలకు Processor కు నడుమ వారధులుగా పని చేస్తున్నాయి కాబట్టి ఆ పేరు వచ్చింది.


ఇక పోతే ఈ north bridge కి processor కి నడుమ ఉన్న మార్గాన్ని system bus లేక local bus లేక Front Side Bus అంటారు.  అంటే రాజ మార్గము అని చెప్పుకోవచ్చును. ఇది CPU లోకెల్లా అత్యంత వెడల్పైన అత్యంత వేగవంతమైన BUS. (CPU లోపల ఏముంది? -3 పోస్ట్ లో ఇప్పటికే చెప్పి ఉన్నాను BUS అనగా మార్గము అని, సాధారణ ప్రయాణ సాధనం లాంటిది కాదు అని; గమనించగలరు.) ఈ north bridge ద్వారా అత్యంత వేగంగా పనిచేసే, అత్యంత వేగం అవసరం ఐన సాధనాలు system bus కి కలుపబడి ఉంటాయి. ఉదాహరణకి గమనించినట్లైతే RAM, PCI express, Graphic card లాంటివి. ఈ north bridge లో సమాచార వేగం దాదాపుగా processor వేగానికి సమానంగా ఉంటుంది. (ఈ వేగాలు యెంత ఉంటాయి అనేది అంకెలలో త్వరలో తెలుసుకుందాము.) 


ఇక మిగిలిన Hard disk , sound card , USB ports మరియు ఇతర PCI పోర్ట్ లు south bridge ద్వారా north bridge కి తద్వారా system bus కి కలుపబడి ఉంటాయి. ఈ south bridge లో సమాచార వేగం north bridge తో పోలిస్తే సుమారు 5 నుంచి 10 వ వంతు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దీని ద్వారా processor కి కలుపు బడుతున్న భాగాలు అంత వేగంగా పని చెయ్యలేవు కాబట్టి వాటికి అంత వెడల్పైన BUS అవసరం లేదు. ఈ south bridge కి north bridge కి మధ్య ఉన్న bus ని PCI BUS అంటారు. ఎందుకంటే దీని ద్వారా దాదాపుగా అన్నీ బాహ్యంగా కలుపబడే (peripheral) మరియు వేగం పరంగా అంత ప్రాధాన్యం లేని భాగాలే కలుపబడుతున్నాయి కాబట్టి.


ఎలాగైతే మహారాజుకి ఆంతరంగిక సలహాదారులు, ప్రధాన మంత్రి అత్యంత ఆప్తులుగా ఉండి అంతఃపురంలో కూడా మహారాజును కలవగలరో అలాగే ఈ north bridge ద్వారా కలుపబడినవి కూడా CPU కి అంత ముఖ్యమైనవి. CPU యొక్క సామర్ధ్యాన్ని వేగాన్ని నిర్ధారించేవి ఈ north bridge ద్వారా కలుపబడిన భాగాలే. ఇక పోతే ఎలాగైతే మిగిలిన అధికారులు, ప్రజలు, యాత్రికులు మహారాజుని కలవాలంటే సభలో మాత్రమే కలవగలరో, అలాగే ఈ south bridge ద్వారా కలుపబడిన భాగాలు కూడా అంత ప్రాధాన్యత సంతరించుకోక north bridge ద్వారా processor కి కలుప బడతాయి. ఇవి మన CPU కి అదనపు హంగులు మాతమే అవుతాయి.


కాబట్టి మన CPU యొక్క సామర్ధ్యాన్ని, వేగాన్ని నిర్ధారించే processor, RAM మరియు ఇతర భాగాలను గురించి తదుపరి post లో వివరంగా తెలుసుకుందాము.