Thursday, October 11, 2018

ముందు మాట

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోను ఒక లాప్ టాప్ లేక పోతే కనీసం ఒక కంప్యూటర్ (డెస్క్ టాప్) ఉంటున్నాయి. అవి గాలి నీరు ఆహరం కన్నా అత్యవసరాలు నిత్యావసరాలు ఐ పొయ్యాయి. స్కూల్ కి వెళ్ళే ఒకటో తరగతి పిల్లవాడు కూడా ఈ రోజుల్లో కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాడు, దానిని ఉపయోగిస్తున్నాడు. కాని వాటిని ఉపయోగిస్తున్న ప్రస్తుత తరం కాకుండా అంతకు ఒక్క తరం ముందు వారికి మాత్రం అది ఒక అంతు చిక్కని బ్రహ్మ పదార్ధంగా మిగిలి పోయింది. వారికి కంప్యూటర్ గురించి అడిగి తెలుసుకోవాలన్నా కొంత మొహమాటం అడ్డు వస్తుంది. కొంత ధైర్యం చేసి అడిగినా వారిని ఏమీ తెలియని వింత జీవులుగా చూడటం మన వంతైంది. ఎందుకంటే మనకు అంత తీరిక ఉండదు కాబట్టి అని సరి పెట్టుకుంటాం. అసలు కారణం మనం ఆ కంప్యూటర్ గురించి మొదలు పెట్టి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనే విషయాల గురించి కనీసం మనసు పెట్టి ఆలోచించక పోవటమే(ఇక్కడ కూడా సమయాభావమే మన సమాధానమవుతోంది) . అలాగని నేనేదో ఇక్కడ గొప్పగా ఆలోచిస్తాను అని చెప్పే ఉద్దేశ్యం కాదు. కానీ మన ముందు తరల వారికి కూడా కంప్యూటర్ గురించి కనీస పరిజ్ఞానం అందించాలనే నా ఈ చిరు ప్రయత్నం. ఇది ఏ కొద్ది మందికి ఉపయోగ పడినా నా ఈ శ్రమకు తగిన ఫలితం దక్కింది అనుకుంటాను. నా ఈ ప్రయత్నాన్ని మనస్పూర్తిగా ఆహ్వానించి ఆదరిస్తారని ఆశిస్తూ... ప్రేమతో మీ రాంకర్రి...



No comments:

Post a Comment